Thursday, November 21, 2024

బెంగాల్ ప్రతిపక్ష నేతగా సువేందు అధికారి

ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్ర‌తిప‌క్ష నేత‌గా బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి ఎన్నికయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేందరూ కలిసి సువేందు అధికారిని ప్ర‌తిప‌క్ష నేతగా ఎన్నుకున్నారు. ప్రతిపక్ష నేత పదవి కోసం సువేందు అధికారితో పాటు మనోజ్ తిగ్గా, ముకుల్ రాయ్ కూడా పోటీ పడ్డారు. ప్రతిపక్ష నేతను ఎన్నుకోవడం కోసం బీజేపీ అధిష్టానం కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌, పార్టీ జాతీయ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ భూపేంద‌ర్ యాద‌వ్‌ను నియ‌మించింది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం సీఎం మ‌మ‌తా బెన‌ర్జీపై గెలిచిన సువేందు వైపే మొగ్గు చూపింది. కాగా 294 అసెంబ్లీ స్థానాల‌కు గానూ బీజేపీ 77 స్థానాల్లో గెలుపొందగా.. మ‌మ‌తా బెనర్జీపై 1,956 ఓట్ల తేడాతో సువేందు అధికారి గెలిచిన సంగతి విదితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement