Tuesday, November 26, 2024

18 నుంచి సూత్ర ఫ్యాషన్ షో.. హోటల్‌ తాజ్‌ క్రిష్ణ వేదికగా 3రోజుల ప్రదర్శన..

బంజారాహిల్స్‌, (ప్రభన్యూస్‌) :ప్రముఖ ఫ్యాషన్‌ షో సూత్ర తన ఫెస్టివ్‌ సీజన్‌ ప్రదర్శనకు సిద్దమైందని, జులై 18,19,20 న తాజ్‌ క్రిష్ణా హోటల్‌ వేదికగా ఫ్యాషన్‌ అండ్‌ లైఫ్ స్టైల్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నామని బంజారాహిల్స్‌ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్వాహకులు పేర్కొన్నారు. రానున్న రాఖీ, తీజ్‌ సందర్భంగా ఫెస్టివల్‌ ప్రత్యేకతతో కూడిన క్రియేటివ్‌ ఫ్యాషన్‌ వియర్స్‌, లైఫ్‌స్టైల్‌ అండ్‌ డిజైనర్‌ వియర్‌, జువెల్లరీ తదితర ప్రొడక్ట్స్‌ ఒకే వేదికగా అందుబాటులోకి తీసుకురానున్న‌ట్టు ఫ్యాష‌న్ షో నిర్వ‌హ‌కులు తెలిపారు.

అన్ని రకాల వెడ్డింగ్‌, ఫెస్టివ్‌, సీజనల్‌ ఫ్యాషన్‌ వియర్స్‌, జువెల్లరీలను దేశవ్యాప్తంగా డిజైనర్ల నుంచి సేకరించి ఒకే వేదిక కింద అందుబాటులో పెట్టడం జరుగుతుందని తెలిపారు. కాగా ఈ ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ తారలు, మోడల్స్ రానున్న‌ట్టు వారు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement