Tuesday, November 26, 2024

Suspicious boat: ముంబైలో అనుమానాస్ప‌ద ప‌డ‌వ … పోలీసుల అదుపులో ముగ్గురు…

ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో అనుమానాస్పద పడవను పోలీసులు కనుగొన్నారు. అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.. వారంతా తమిళనాడులోని కన్యాకుమారి వాసులని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయమై ముగ్గురు వ్యక్తులను విచారిస్తున్నారు.

సంఘటనా స్థలంలో కోలాబా పోలీసులు చేరుకుని.. ఈ బోటును కువైట్‌ నుంచి తెప్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ అంశంపై విచారణ జరుగుతోంది. వారి వద్ద ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. అయితే, సుమరం చైత్రాలి అనే బోటు గేట్‌వే ఆఫ్ ఇండియా నుంచి లైట్‌హౌస్ ప్రాంతానికి సాధారణ మెరైన్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. అబ్దులా షరీఫ్-1 పేరుతో కువైట్‌కు చెందిన బోటును గుర్తించినట్లు పేర్కొన్నారు. బోటులో ఉన్న ముగ్గురిని విచారించగా ముగ్గురినీ రెండేళ్ల క్రితం తమిళనాడుకు చెందిన కెప్టెన్ మదన్ అనే ఏజెంట్ పని నిమిత్తం కువైట్‌కు పంపారు. వారు అబ్దులా షరీఫ్‌కు చెందిన అబ్దులా అనే పడవలో గత రెండేళ్లుగా కువైట్‌లో మత్స్యకారులుగా పని చేస్తున్నాట్లు తెలిపారు.. అయితే, తిరిగి ఇండియాకు వచ్చేందుకు తమ పాస్ పోర్టులు ఇవ్వాలని కోరాగా.. అతను నిరాకరించాడు.. దీంతో వారు అక్కడ నుంచి పారిపోయి అబ్దుల్ షరీఫ్ బోటును తీసుకుని భారతదేశానికి వస్తున్న క్రమంలో ముంబైకి వచ్చారని పోలీసులు తెలిపారు. ఇక, 2008 నవంబర్‌లో ముంబైలో ఉగ్రదాడి చేసిన పది మంది పాకిస్తానీ ఉగ్రవాదులు సముద్ర మార్గం నుంచి రావడం గమనార్హం. దీంతో సముద్ర మార్గాలపై పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement