చత్తీస్ గడ్ – అధికారి తన స్మార్ట్‌ఫోన్ రిజర్వాయర్‌లో పడేసుకున్నారు.. దీంతో ఆ ఫోన్‌ను తీసేందుకు 21 లక్షల లీటర్ల నీటిని తోడి నీటిని వృథా చేసిన ఆ అధికారి ఘటన చత్తీస్ గఢ్ లోని కంకేర్ జిల్లాలోని కొయాలిబేడా బ్లాక్‌లో జరిగింది.. వివరాలలోకి వెళితే కంకేర్ జిల్లాలోని ఖేర్‌కట్టా రిజర్వాయర్ వద్దకు తన మిత్రులతో కలిసి ఫుడ్ ఇన్ స్పెక్టర్ రాజేశ్ విశ్వాస్ పిక్నిక్ కు వెళ్లారు. అయితే సెల్ఫీ దిగుతున్న సమయంలో ఫోన్ ఆ డ్యామ్‌లో పడింది. రూ.96 వేల విలువైన ఆ ఫోన్‌లో విలువైన డేటా ఉందన్న కారణంతో తొలుత ఫోన్ కోసం ఈతగాళ్లతో అన్వేషించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నంలో సక్సెస్ కాకపోవడంతో, 15 అడుగుల లోతైన ఆ డ్యామ్ నుంచి 30 హెచ్‌పీ డీజిల్ పంపులతో ఒకే రోజు 21 లక్షల లీటర్ల నీటిని తోడించేశారు. కానీ ఫోన్ దొరక్కపోవడంతో మూడు రోజుల పాటు నీటిని తోడించేశారు. 41,104 క్యూబిక్ మీటర్ల నీళ్లు వృథాగా పోయాయి. ఆ నీరు ఉండుంటే 1,500 ఎకరాలకు ఉపయోగపడేవి. మూడు రోజులకు ఫోన్ దొరికింది. అయితే అప్పటికి అది వర్కింగ్ కండిషన్ లో లేదు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో అతడిని ఉద్యోగం నుంచి తొలిగించారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement