మల్టీజోన్ -1 పరిధిలో విధుల్లో అలసత్వం వహించిన ఆరుగురు పోలీసు అధికారులను ఐజీ ఏవీ రంగనాథ్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉన్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజా భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్‌ను తప్పించేందుకే పంజాగుట్ట ఇన్స్పెక్టర్తో సంప్రదింపులు జరిపినట్టుగా హైదరాబాద్ సీపీ విచారణలో తేలడంతో అప్పటి బోధన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్‌ను సస్పెండ్ చేశారు.
మద్యం సేవించి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి స్టేషన్ సిబ్బందిని ఇబ్బందులకుగురి చేసిన నిజామాబాద్ జిల్లా సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎం.రమేశ్‌ను సస్పెండ్ చేశారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన గంజాయి కేసులో అలసత్వంగా వ్యవహారించిన ఎస్సైలు మనోహర్ రావు, తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ బి. రవీందర్ రెడ్డి, కానిస్టేబుల్ టి.నరేందర్ లను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్- 1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.