ఓ ఎమ్మెల్యే తన వాహనంతో బీభత్సం సృష్టించాడు. రద్దీగా ఉండే ఏరియాలో జనాలపైకి వాహనంతో దూసుకెళ్లడంతో డ్యూటీలో ఉన్న ఏడుగురు పోలీసులతో పాటు 23మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఒడిశాలోని బాన్పూర్ ఆఫీసు దగ్గర ఇవ్వాల (శనివారం) జరిగింది. అయితే.. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ని పట్టుకుని స్థానికులు గుంపుగా చేరి ఇష్టమొచ్చినట్టు చితకబాదారు.
వారి దాడిలో తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్యేను తంగి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్కు తీసుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఎస్పీ అలేఖ చంద్ర తెలిపారు. అయితే.. గత ఏడాది అక్టోబర్‌లో బీజేపీ నాయకుడిపై దాడికి పాల్పడినందుకు జగదేవ్‌ను బిజూ జనతాదళ్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇదే ఘటనలో అతడిని అరెస్టు కూడా చేశారు.