Tuesday, November 19, 2024

సూర్యకుమార్‌ యాదవ్‌ మరో అరుదైన రికార్డు

టీమిండియా టీ 20 సంచలనం సూర్యకుమార్‌ యాదవ్‌ మరో అరుదైన రికార్డును స్వంతం చేసుకున్నాడు. పొట్టి క్రికెట్‌లో అదరగొడుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌, మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనాను దాటేశాడు. భారత్‌ తరపున అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా నిలిచాడు. భారత్‌ తరపున అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా నిలిచాడు. 44 ఇన్నింగ్స్‌ ఆడిన సూర్య ఖాతాలో ప్రస్తుతం 1,625 రన్స్‌ ఉన్నాయి. ధోనీ 98 మ్యాచుల్లో 1,617, రైనా 78 గేమ్స్‌లో 1, 605 పరుగులతో వరుసగా ఆరు, ఏడుస్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్‌ కోహ్లీ 4,008 రన్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు.


రాంచీలో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ 20లో సూర్య 34 బంతుల్లోనే 47 రన్స్‌ చేశాడు. అతడిని సోధీ ఔట్‌ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. గతేడాది విధ్వంసక ఇన్నింగ్‌లతో చెలరేగిన సూర్య్‌ ఐసీసీ మెన్స్‌ టీ 20 ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా సెలెక్ట్‌ అయ్యాడు. 2001 మార్చిలో భారత టీ 20 జట్టుకి ఎంపికైన సూర్య అనతికాలంలోనే జ ట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 360 డిగ్రీ ప్లేయర్‌గా మాజీలతో ప్రశంసలు అందుకుంటున్న అతను ఈ ఫార్మట్‌లో ఇప్పటికే మూడు శతకాలు బాదాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement