Thursday, November 21, 2024

టీ 20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ రేసులో సూర్యకుమార్‌ యాదవ్‌

ప్రతి ఏడాది లానే ఈ ఏడాది టీ 20 క్రికెట్‌లో అద్భుత ఫామ్‌ కొనసాగించిన ఆటగాళ్లకు పురస్కారాన్ని అందించే దిశగా పురుషుల ‘టీ 20 క్రికెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ -2022’ అవార్డుకు నామినేట్‌ అయిన ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) విడుదల చేసింది. ఐసీసీ పురస్కారంతో గౌరవించనుంది. తాజాగా మెన్స్‌ 2022 టీ 20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు నామినేట్‌ ఆటగాళ్ల జాబితాను ఐసీసీ గురువారం ప్రకటించింది. అవార్డు రేసులో నలుగురు ఆటగాళ్లు ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా నయా సంచలనం సూర్యకుమార్‌ కూడా చోటు సంపాదించాడు. ఇంగ్లండ్‌ యువ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌, పాకిస్థాన్‌ ఓపెనర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ , జింబాబ్వే ఆల్‌ రౌండర్‌ సికిందర్‌ రజా ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నారు.

టీ 20 ప్రపంచకప్‌లో ఈ నలుగురు ప్లేయర్స్‌ తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది టీ 20ల్లో సూర్యకుమార్‌ అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. అతను 187.43 స్ట్రయిక్‌ రేటుతో 1, 164 పరుగులు చేశాడు. అంతే కాదు పొట్టి క్రికెట్‌లో సూర్య అత్యధికంగా 68 సిక్స్‌లు కొట్టాడు. భీకర ఫామ్‌ కొనసాగించిన అతను రిజ్వాన్‌ను వెనక్కి నెట్టి వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌ సిరీస్‌లోనూ సూర్య చెలరేగి ఆడి కెరీర్‌లో రెండో టీ 20 సెంచరీ నమోదు చేశాడు. పొట్టి ప్రపంచకప్‌లో అదరగొట్టిన సామ్‌ కరన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా ఎంపికయ్యాడు.

ఉత్తమ ఫామ్‌లో ఉన్న అతడు ఐపీఎల్‌ 2023 మినీ వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. పంజాబ్‌ కింగ్స్‌ అతడిని రూ 18.50 కోట్లకు దక్కించుకుంది. ఇక మహిళల టీ 20 క్రికెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2022 అవార్డుకు నామినేట్‌ అయిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది ఐసీసీ. వీరిలో టీమ్‌ ఇండియా తరపున స్మృతి మందాన ఎంపిక కాగా, మిగతా జట్ల తరపున పాక్‌ ఆల్‌ రౌండర్‌ నిదాడర్‌, న్యూజిలాండ్‌ సోఫీ డివైన్‌, ఆస్ట్రేలియా తహ్లియా మెగ్‌గ్రత్‌ నామినేట్‌ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement