ఫ్లోరిడా వేధికగా విండీస్‌తో నిన్న (శనివారం) జరిగిన నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో గెలిచిన భారత్ ప్రస్తుతం 2-2తో సిరీస్‌ని సమం చేసింది. కాగా, ఇవ్వాల జరుగుతున్న ఫైనల్ అండ్ డిసైడింగ్ మ్యాచ్ లో మెదట టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకోగా.. నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. వెస్టిండీస్ కు 166 పరుగులు టార్గెట్ ని సెట్ చేసింది. ఇక నెక్స్ట్ విండీస్ చేజింగ్ దిగనుండగా.. డిఫెండింగ్ లో బౌలర్ల చేతివాటం చాలా ముఖ్యంగా మారింది.
నిన్న చలరేగిన ఓపనెర్లు యశస్వి జైస్వాల్ (5), శుభమాన్ గిల్ (9) ఇవ్వాల అతి తక్కువ పరుగులతో పెవిలియన్ చేరుకున్నారు. ఇక తిలక్ వర్మ, సంజు సాంసన్ (27), (13) పరుగులు చేసి అవుట్ అయ్యారు. అయితే, సూర్య కుమార్ యాదవ్ 45 బంతుల్లో 61 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో టీమిండియాను ఆదుకున్నాడు. మొత్తానికి సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీతో రాణించగా.. తిలక్ వర్మ ఆకట్టుకున్నాడు. ఇక వీరిద్దరు మినహా మిగిలిన బ్యాటర్లు ఘోరంగా విఫలం అయ్యారు.
కప్టెన్ హార్డిక్ పాండ్యా కూడా 14 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. ఇక ఆఖరి ఓవర్లలో గ్రీస్ లోకి వచ్చిన అర్షదీప్ సింగ్ 8 పరుగులు చేయగా, కుల్దీప్ యాదవ్ ఒక్క రన్ కూడా చేయకుండ పెవిలియన్ చేరాడు. అక్షర్ పటేల్ 13 పరుగులు చేయగా.. ముఖేష్ కుమార్ 4 పరుగులు చేశాడు