టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ వీరవిహారం స్వదేశంలోనే కాదు శత్రుదేశం పాకిస్తాన్‌లో కూడా ప్రశంసలు అందుకుంటున్నది. తాజాగా ఆ దేశ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా సూర్య ఆటకు మంత్రముగ్దుడయ్యాడు. శ్రీలంకతో మూడో మ్యాచ్ ముగిసిన తర్వాత కనేరియా మాట్లాడుతూ… మాట్లాడుతూ.. ”సూర్య ఇప్పుడు నయా యూనివర్సల్ బాస్. అతడు ప్రస్తుతం బీస్ట్ మోడ్‌లో ఉన్నాడు. నేను అంతకముందు కూడా ఓసారి చెప్పినట్టు.. ఇటువంటి ఆటగాడు లైఫ్‌లో ఒకసారి మాత్రమే అరుదుగా దొరుకుతాడు.
ఇక లంకపై మూడో మ్యాచ్‌లో అతడు ఆడిన ఇన్నింగ్స్ నభూతో నభవిష్యత్. నాకు చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు. కొంతకాలం క్రితం మనం టీ20 అంటే క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ పేర్లను చెప్పుకునేవాళ్లం. కానీ ఇప్పుడు సూర్యను చూస్తే ఆ ఇద్దరూ తేలిపోతారు. టీ20 క్రికెట్‌ను సూర్య ఇప్పటికే నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లాడు. రాబోయే రోజుల్లో అతడి విధ్వంసాలు కొనసాగే అవకాశముంది..” అని అన్నాడు.