నూతన సంవత్సర వేడుకలకు ముందు ఢిల్లీ పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీకి ఆనుకుని ఉన్న సరిహద్దులు, ప్రాంతాల్లో భద్రతను పెంచారు. వివిధ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.
మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం, ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టేందుకు ఢిల్లీ పోలీసులు 10,000 మందికి పైగా పోలీసులను మోహరించాలని నిర్ణయించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన జరగకుండా పారామిలటరీ బలగాలను I మోహరించడంతో పాటు అదనపు పికెట్లు, బారికేడ్లు, పోలీసు సిబ్బందిని మోహరించారు. న్యూ ఇయర్ సందర్భంగా మద్యం తాగి వాహనం నడిపితే రూ. 10,000 జరిమానా విధించే చట్టపరమైన నిబంధన ఉందని పోలీసులు తెలిపారు. దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ను మూడు నెలల పాటు సస్పెండ్ చేయవచ్చు.