హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి సరెండర్ లీవ్‌ల నిమిత్తం భారీ మొత్తాన్ని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.182.48 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 182.48 కోట్ల రూపాయల మొత్తాన్ని పోలీస్ సిబ్బందికి మంజూరు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఎంతోకాలంగా పోలీస్ సిబ్బంది ఎదురుచూస్తున్న సరెండర్ లీవ్‌లకు సంబంధించిన బడ్జెట్‌ను విడుదల చేయడం పట్ల తెలంగాణ పోలీస్ అధికారుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. మిగిలిన బకాయిలను దశలవారీగా త్వరితగతిన మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.