మారియపోల్ మా చేతుల్లోకి వచ్చేసింది.. తక్షణం ఆయుధాలు వీడి లొంగిపొమ్మని మీ సైనికులను ఆదేశించండి, అర్థంపర్థంలేని ఎదురుదాడులను నిలిపివేయమని చెప్పండి.. అలా చేస్తే ప్రాణాలతో వదిలేస్తాం.. లేదా విధ్వంసం తప్పదని ఉక్రెయిన్‌కు రష్యా తీవ్ర హెచ్చరికలు చేసింది. ఉక్రెయిన్‌లో అత్యంత కీలకమైన నౌకాశ్రయ నగరం మారియపోల్‌ను దాదాపు స్వాధీనం చేసుకున్న రష్యాతో ఉక్రెయిన్ సైనికులు పోరాడుతూనే ఉన్నారు. దీనిపై అసహనంతో ఉన్న రష్యా రక్షణశాఖ మంగళవారంనాడు తాజా హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.
ఇప్పుడే అసలైన రెండోదశ యుద్ధం ప్రారంభమైందని, చివరివరకు తమ భూభాగాన్ని రక్షించుకునేందుకు పోరాడుతూనే ఉంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించిన నేపథ్యంలో రష్యా స్పందిస్తూ ఈ ఆల్టిమేటం జారీ చేసింది. తమ హెచ్చరికను ఉక్రెయిన్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని, ఇప్పటివరకు సైనికులకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని మండిపడింది. సైనికులైనా స్వచ్చందంగా లొంగిపోవాలని, అలాంటివారికి ప్రాణభిక్ష పెడతామని పిలుపునిచ్చింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..