యాదాద్రి సమీపంలో ఉన్న సురేంద్రపురిని ప్రముఖ పారిశ్రామిక వేత్త కుందా సత్యనారాయణ నిర్మించారు. కాగా ఆయన అనారోగ్యం బారినపడి మృతి చెందిన తన చిన్న కుమారుడు సురేందర్ జ్ఞాపకార్థం సురేంద్రపురిని నిర్మించారు. కాగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. కాగా ఆయనకు ఆయనకు భార్య హైమావతి, కుమారులు శ్రీనివాస్, ప్రతాప్, కుమార్తె సూర్యకుమారి ఉన్నారు. 1938 జూన్ 15వ తేదీన ఆయన జన్మించారు.
సురేంద్రపురిలో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలకు దృశ్యరూపాన్ని ఇచ్చారు. పంచముఖ ఆంజనేయుడు, శివుడు, వేంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మించారు. అందరు దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయి. 2009 ఫిబ్రవరి 8న దీన్ని ప్రారంభించారు. హైదరాబాద్ కి సమీపంలో ఉండటంతో సురేంద్రపురికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. నేటి మధ్యాహ్నం ఒంటి గంటకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కుందా సత్యనారాయణ అంత్యక్రియలు జరగనున్నారు. ఆయన మరణం పట్ల పలువురు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..