కోల్‌కత్తా ఆర్‌జీ కార్ హాస్పిటల్‌లోని ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఆగస్టు 20వ తేదీన విచారణ చేపట్టనుంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేపీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈకేసు విచారణ చేపట్టేందుకు అంగీకరించింది.
ఇప్పటికే ఈ కేసుపై విచారణ జరిపిన కోల్‌కత్తా హైకోర్టు కేసుని సీబీఐకి బదిలీ చేసింది. అప్పటి నుంచి విచారణ వేగవంతమైంది. సీబీఐ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాలేజ్ మాజీ ప్రిన్సిపల్‌తో పాటు… తోటి డాక్టర్‌లు, హాస్పిటల్ సిబ్బందితోనూ విచారణ జరుపుతున్నారు.
కాగా, ఈ కేసులో ఓ వాలంటీర్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. బ్లూటూత్ హెడ్‌సెట్ ఆధారంగా ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు. సామూహిక అత్యాచారం జరిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే.. పోలీసులు మాత్రం కొట్టి పారేస్తున్నారు.