Saturday, November 23, 2024

అబూసలేం విడుదలకు సుప్రీం అనుమతి

1993 ముంబై పేలుళ్ల కేసులో గ్యాంగ్‌స్టర్‌ అబూ సలేం 25 ఏళ్లు జైలు శిక్షను పూర్తి చేశాడు. అయితే ఆయన విడుదలకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 2002లో తనను అప్పగించేందుకు పోర్చుగల్‌కు భారత్‌ హామీ ఇచ్చిన ప్రకారం అతని శిక్ష 25 ఏళ్లకు మించదు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 72 ప్రకారం జాతీయ నిబద్దత కోసం భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని న్యాయమూర్తులు ఎస్‌కె కౌల్‌, ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 25 సంవత్సరాలు పూర్తయిన ఒక నెలలో అవసరమైన పత్రాలను ఫార్వర్డ్‌ చేయాలి.

వాస్తవానికి 25 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒక నెల వ్యవధిలో ప్రభుత్వం సిఆర్‌పిసి క్రింద ఉపశమన అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు అని బెంచ్‌ పేర్కొంది. ముంబైకు చెందిన బిల్డర్‌ ప్రదీప్‌ జైన్‌ను అతని డ్రైవర్‌ మెహందీ హసన్‌తో కలిసి హత్య చేసిన కేసులో సలేంకు జీవిత ఖైదు విధించింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత నవంబర్‌ 11,2005లో పోర్చుగల్‌ నుండి అబూసలేం భారత్‌కు వచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement