న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 14 లోగా రాతపూర్వక సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
బెయిల్ మీద విడుదలైన గంగిరెడ్డి సాక్షులను బెదిరిస్తున్నారని సీబీఐ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చింది. ఈ క్రమంలో దర్యాప్తునకు ఆటంకం కలుగుతోందని, అందుకే గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. సీబీఐ లేవనెత్తిన అభ్యంతరాలపై రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ వచ్చే నెల 14కు వాయిదా వేసింది.