Friday, November 22, 2024

నేరచరితులపై కేంద్రం, ఈసీలకు సుప్రీం నోటీసులు.. ఎన్నికల్లో పోటీకి క్రిమినల్స్‌పై నిషేధం

తీవ్రమైన నేరారోపణ కలిగిన వ్యక్తులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ, దాఖలైన పిటిషన్‌పై స్పందించాలని కోరుతూ, సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికీ నోటీసులు జారీ చేసింది. జస్టిస్‌ కె ఎం జోసెఫ్‌ మరియు జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌ల ద్విసభ్య ధర్మాసనం కేంద్ర చట్ట, న్యాయశాఖ, కేంద్ర హోంశాఖకు.. ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

ఈ పిటిసన్‌ను అడ్వకేట్‌ అశ్విని ఉపాధ్యాయ్‌ దాఖలు చేశారు. క్రిమినల్‌ కేసులు నమోదైన వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలని అడ్వకేట్‌ ఉపాధ్యాయ్‌ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement