Friday, November 22, 2024

రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు… లాకప్ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టండి..

లాక‌ప్ డెత్ లు, హింస‌ను అరిక‌ట్టేందుకు సుప్రీం కోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అన్ని రాష్ట్రాల‌కు ప‌లు సూచ‌న‌లు, సల‌హాలు ఇచ్చింది. ప్ర‌తి పోలీస్ స్టేష‌న్ లో సీసీ కెమెరాలు అమ‌ర్చాల‌ని ఆదేశించింది. పోలీస్​ స్టేషన్లలోని ఇంటరాగేషన్, లాకప్​ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దేశంలోని అన్ని పోలీస్​ స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ ​ప్లేసులతో పాటు లాకప్​ రూములు, కారిడార్, స్టేషన్​ రిసెప్షన్​ ఏరియా, సబ్​ ఇన్​స్పెక్టర్, ఇన్​స్పెక్టర్​ రూమ్​లు, వాష్​ రూమ్​ బయట సీసీ కెమెరాలను అమర్చాలంది. సీబీఐ, ఎన్ఐఏ, ఈడీ వంటి విచారణ సంస్థల ఆఫీసుల్లోనూ సెక్యూరిటీ కెమెరాలు పెట్టాలని సూచించింది. కస్టడీలో నిందితులపై హింసను అరికట్టేందుకు సీసీ కెమెరాలతో పాటు ఆడియో రికార్డింగ్​ కూడా చేయాలని సూచించింది. కెమెరాల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని, నిర్ణీత సమయంలోపల సీసీటీవీ కెమెరాలను అమర్చాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం ఆదేశించింది. ఈ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి యాక్షన్​ ప్లాన్​ను ఆరు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. ఈ కెమెరాల్లో రికార్డైన పుటేజ్​ను, ఆడియో రికార్డింగ్​ను 18 నెలల పాటు జాగ్రత్త చేయాలని, అవసరమైతే కోర్టులకు ఎవిడెన్స్​గా అందజేయాలని పేర్కొంది. పోలీస్​ స్టేషన్లలో విచారణ సందర్భంగా మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఇండిపెండెంట్​ ప్యానెల్​తో తరచూ సీసీటీవీ ఫుటేజ్​ చెకింగ్​ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ప్రతీ జిల్లాలో హ్యూమన్​ రైట్స్​ కోర్టులను ఏర్పాటు చేయాలని ఆర్డర్​ వేసింది. పంజాబ్​లో జరిగిన కస్టోడియల్​ డెత్​కు సంబంధించిన కేసు విచారణలో సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇంటరాగేషన్​ ఏరియాలలో కెమెరాల ఏర్పాటుకు 2018లోనే ఆదేశాలు జారీ చేసినా.. ఇప్పటి వరకూ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏర్పాట్ల సంబంధించిన వివరాలను వచ్చే నెల 27న పరిశీలిస్తామని కోర్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement