Monday, November 18, 2024

జ్ఞానవాపి కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే..

ఢిల్లీ: జ్ఞానవాపి కేసులో డెంటింగ్ కు అనుమ‌తిస్తూ అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది.. శాస్త్రీయ సర్వే అంశాన్ని పక్కనపెట్టి, ఈ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. వివ‌రాల‌లోకి వెళితే జ్ఞాన్‌వాపి మసీదు కాంప్లెక్స్‌లో క‌నిపించిన ఒక ఆకారం ‘శివలింగం’ అని పేర్కొంటూ హిందూ ఆరాధకులు, శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో కార్బన్‌ డేటింగ్ సహా సైంటిఫిక్‌సర్వేకు పురావస్తు శాఖకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఆ సమయంలో ‘శివలింగం’గా పేర్కొంటున్న ఆకారానికి ఎలాంటి నష్టం జరగకూడదని స్పష్టం చేసింది. అయితే.. అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలపై జ్ఞానవాపి మసీద్‌ ప్యానెల్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్ హైకోర్టు తీర్పుతో విభేదించింది. ”ఈ విషయంలో మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. తొందరపాటు వద్దు. కాబట్టి శాస్త్రీయ సర్వేను వాయిదా వేద్దాం” అని మధ్యంతర స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఈ ఆదేశాలు అమలు అవుతాయని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement