బాబా రామ్ దేవ్ వ్యాఖ్యలపై సుప్రీంలో వేసిన పిటిషన్ పై న్యాయస్థానం ఈ రోజు విచారించింది. అల్లోపతి మందుల గురించి చేసిన వ్యాఖ్యల అసలు రికార్డులను సమర్పించాలని బాబా రామ్‌దేవ్‌ను సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. ఆయన చెప్పిన అసలు మాటలు ఏమిటి? మీరు మొత్తం వివరాలను సమర్పించలేదు’’ అని అడ్వకేట్ ముకుల్ రోహత్గిని ఉద్దేశించి జస్టిస్ రమణ అన్నారు. దీనిపై స్పందించిన రోహత్గి మాట్లాడుతూ, ఒరిజినల్ వీడియోను, దానిలోని మాటలను రాసిన పత్రాలను సమర్పిస్తానని తెలిపారు. దీంతో తదుపరి విచారణను జూలై 5కు వాయిదా వేశారు.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో అల్లోపతి మందులను వాడటంపై రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై బిహార్, ఛత్తీస్‌గఢ్‌లలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖలు కేసులను దాఖలు చేశాయి. ఆయన వ్యాఖ్యలు కోవిడ్ నియంత్రణకు విఘాతం కలిగించే అవకాశం ఉందని, ప్రజలు సరైన వైద్య చికిత్సను పొందకుండా నిరుత్సాహపరిచే అవకాశం ఉందని ఆరోపించాయి. వీటిపై విచారణను నిలిపేయాలని కోరుతూ బాబా రామ్‌దేవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇది కూడా చదవండి: మళ్లీ మొదటికొచ్చిన బ్రహ్మంగారి పీఠాధిపత్యం వివాదం