Saturday, November 23, 2024

స.హ చట్టం నుంచి మినహాయించాలన్న బ్యాంకుల పిటిషన్ ని తిరస్కరించిన సుప్రీం

సుప్రీం కోర్టులొ బ్యాంకులకు మరోసారి షాక్ తగిలింది. సమాచార హక్కు చట్టం నుంచి తమను మినహాయించాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రుణ ఎగవేతదారుల జాబితాలను, వార్షిక నివేదికల సమాచారాన్ని ఆర్బీఐ వెల్లడించాలంటూ, గతంలో వెల్లడించిన తీర్పును వెనక్కు తీసుకునేందుకు తిరస్కరించింది. గతంలో ఇచ్చిన తీర్పును ఉపసంహరించుకోవాలని ఆర్థిక సంస్థలు, బ్యాంకులు పిటిషన్ వేయగా, విచారించిన అత్యున్నత ధర్మాసనం, తమ నిబంధనలల్లో అటువంటి ఏవీ లేవని తేల్చి చెప్పింది. అయితే, ఈ తరహా కేసుల్లో చట్టపరంగా ఉన్న ఇతర అవకాశాలను వినియోగించుకునే వెసులుబాటు ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement