బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌పై డ్రగ్ కంట్రోలర్ శాఖ దాఖలు చేసిన కేసులో స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అక్రమ రీతిలో కోవిడ్ ఔషధాలను నిల్వ చేసినట్లు గంభీర్ ఫౌండేషన్‌పై డ్రగ్ కంట్రోలర్ కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో విచారణను నిలిపివేయాలని గంభీర్ తరపున న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది.
కరోనా సెకండ్ వేవ్ సమయంలో గంభీర్ ఫౌండేషన్ సుమారు రెండు వేలకు పైగా ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను పంచిపెట్టింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పునిస్తూ.. ఆ కేసులో మేం స్టే ఇవ్వలేమని, ఢిల్లీ హైకోర్టు ముందు మీ వాదనలు ఇవ్వాలంటూ పేర్కొన్నది. డ్రగ్స్, కాస్మటిక్స్ యాక్ట్ ప్రకారం గంభీర్ ఫౌండేషన్‌పై కేసు దాఖలు చేశారు. ఫాబీఫ్లూ, ఆక్సిజన్‌ను అక్రమంగా నిల్వ చేసినట్లు గంభీర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఫౌండేషన్‌తో పాటు అనైతిక రీతిలో ఔషధాలను అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ వార్త కూడా చదవండి: శ్రీలంకతో తొలి టీ20లో భారత్ శుభారంభం