Friday, September 13, 2024

NEET-UG | నీట్ ఫలితాలు విడుదల చేయండి.. సుప్రీం ఆదేశాలు..

నీట్ యూజీ 2024 పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పేపర్ లీక్ కేసుకు సంబంధించిన తీర్పులో రేపు (జూలై 19) సాయంత్రం 5 గంటలలోపు నీట్-యుజి 2024 పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కులను ప్రచురించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

నగర, కేంద్రాల వారీగా అభ్యర్థుల వివరాలను గోప్యంగా ఉంచి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయాలని తెలిపింది. ఇక నీట్ యూజీ 2024 పేపర్ లీకేజీ అంశంపై జులై 22వ తేదీన (సోమవారం) మరోసారి విచారణ జరుపుతామని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement