Friday, November 22, 2024

సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. అనంతగిరి, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని, పెళ్లి కాని మేజర్లకు విడిగా పరిహారం ఇవ్వాలని హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ అంశంపై తెలంగాణ సర్కారు తరఫున సీనియర్ అడ్వకేట్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. గతంలో పూర్తి వాదనలు వినకుండానే హైకోర్టు తీర్పు ఇచ్చిందని సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. దీంతో నిర్వాసితులకు పరిహారంపై దాఖలైన పిటిషన్లను పునర్విచారించాలని హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనమే దీనిపై విచారించాలని సుప్రీంకోర్టు సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement