Saturday, November 23, 2024

నేలమట్టం కాబోతున్న ట్విన్ టవర్స్‌

ట్విన్ టవర్స్ అమెరికాలో ఆల్ ఖైదా టెర్రరిస్టులు 2001లో నేల మట్టం చేశారు. విమానాలతో టవర్ పై దాడికి దిగి దాన్ని తునాతునకలు చేశారు. దాని ఫలితంగా అమెరికా సైనిక దళాలు ఆఫ్గనిస్తాన్ ను ఆక్రమించుకున్నాయి..తాజాగా ఆఫ్గన్ లో జరుగుతున్న పరిణామాలు అందరికి తెలిసిందే. అయితే మరోసారి ట్విన్ టవర్స్ కూల్చివేయాల్సిన పరిస్థతి ఏర్పడింది. అది ఎక్కడో కాదు ఇండియాలోనే. అది ఓ అక్రమ కట్టడం. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 40 అంతస్తులు భవనం నేలమట్టం కాబోతుంది. అక్రమంగా నిర్మించారని తేలడంతో నోయిడాలోని 40 అంతస్తుల ట్విన్ టవర్స్‌ కూల్చివేయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు.

అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన దేశ అత్యున్నత న్యాయ స్థానం.. ప్లాట్ ఓనర్లకు 12శాతం ఇంట్రెస్ట్‌తో డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. ఎమరాల్డ్‌ కోర్టు ప్రాజెక్టులో భాగంగా ఈ ట్విన్ టవర్స్‌ను సూపర్ టెక్‌ సంస్థ నిర్మించింది. ఇందులో 900లకు పైగా ప్లాట్స్ ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించి భవన నిర్మాణం జరిగిందంటూ 2014లోనే అలహాబాద్ హైకోర్టు నిర్ధారించింది. దీనిపై సూపర్ టెక్‌ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించగా అక్కడా చుక్కెదురైంది. నోయిడా అథారిటీ అధికారులు, సూపర్‌ టెక్ ప్రతినిథులతో కుమ్మక్కయ్యారని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. మూడు నెలల్లోగా కూల్చివేతలు పూర్తి చేయాలని.. దీనికి అయ్యే ఖర్చును సూపర్ టెక్‌ భరించాలని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలతో దాన్ని కూలగొట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఏం చేయాలో తెలియక దాని యాజమాన్యం తలపట్టుకుంటోంది.

ఇది కూడా చదవండి: సరదాకి డీఎన్ఏ టెస్టు చేయించిన తండ్రి..విషయం తెలిసి షాక్

Advertisement

తాజా వార్తలు

Advertisement