Friday, November 22, 2024

National | ద్రవ్యబిల్లు కేసులపై సుప్రీం ధర్మాసనం.. చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వెల్లడి

ద్రవ్యబిల్లుకు సంబంధించిన కేసుల విచారణ ఏడుగురు జడ్జీలతో కూడిన ధర్మాసనాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ శుక్రవారం తెలిపారు. సీనియర్‌ అడ్వకేట్‌ మేనకా గురుస్వామికి బదులిస్తున్న సందర్భంగా ఏడుగురు జడ్జీలు, తొమ్మిది మంది జడ్జీలతో కూడిన ధర్మాసనాలు తీర్పు ఇవ్వాల్సిన పెండింగ్‌ కేసులను వచ్చే వారానికి లిస్టింగ్‌ చేస్తున్నట్టు సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ తెలిపారు.

చీఫ్‌ జస్టిస్‌, జస్టిస్‌ జేబీ పర్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఎదుట వాదనలు వినిపిస్తున్న సందర్భంగా ద్రవ్యబిల్లుకు సంబంధించిన కేసులపై ధర్మాసనం దృష్టిని మళ్ళించారు. వాటి విచారణ కోసం ఏడుగురు జడ్జీల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. నగదు అక్రమ మళ్ళింపు నిరోధక చట్టానికి(పీఎంఎల్‌ఏ) సవాల్‌గా నిలిచిన ద్రవ్య బిల్లుకు సంబంధించిన కేసులను తాను ప్రస్తావిస్తున్నట్టు గురుస్వామి ధర్మాసనానికి విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన చీఫ్‌ జస్టిస్‌ ఈ కేసుల విచారణకు ఏడుగురు జడ్జీల ధర్మాసనాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement