Tuesday, December 10, 2024

Supreme Court: వివేకా కేసులో.. భాస్కర్ రెడ్డికి నోటీసులు

వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో నిందితుడు భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఈ కేసు ప్రతివాదులతో పాటు సీబీఐకూ నోటీసులు జారీ చేసింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వద్దంటూ గతంలో దాఖలు చేసిన సీబీఐ పిటిషన్‌నూ, సునీత పిటిషన్‌ను ఈ నోటీసులకు జత చేసింది. విచారణను మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది.

కాగా వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని పిటిషన్ దాఖలు చేసింది. సునీత పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో సీబీఐ పిటిషన్‌ను జత చేస్తూ భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement