దేశంలో వచ్చే ఏడాది జమిలి ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న వేళ ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒక ఎన్నికలో అధిక ఓట్లు నోటాకు వస్తే ఆ ఎన్నికను రద్దు చేయాలంటూ బీజేపీ నేత, లాయర్ న్యాయవాది అశ్వనీకుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా అశ్వనీకుమార్ తరఫున సీనియర్ న్యాయవాది గురుస్వామి వాదనలు వినిపించారు.
ఏదైనా నియోజకవర్గంలో నిలబడిన అభ్యర్థులకు పడిన ఓట్ల కన్నా నోటాకు ఎక్కువ మద్దతు పలికితే ఆ నియోజకవర్గం నుంచి తిరిగి ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వవలసి ఉంటుందని, 50 శాతం నోటా ఓట్లను పరిగణలోకి తీసుకోవాలన్న నిబంధన ఉందని పిటిషన్ తరఫు న్యాయవాది గురుస్వామి గుర్తుచేశారు. నిజానికి.. నోటా ప్రవేశపెట్టిన స్ఫూర్తికి విరుద్ధంగా ప్రస్తుత పరిస్థితి ఉందని, ఏదైనా ఎన్నికలో 99 శాతం మంది ఓటర్లు అభ్యర్థిని తిరస్కరించి, ఒక్క శాతం మంది ఓటర్లు ఓటేసినా ప్రజాప్రతినిధులు గెలుస్తున్నారని, కాబట్టి నోటాకు ఎక్కువ ఓట్లోస్తే ఎన్నికను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతున్నట్లు గురుస్వామి తెలిపారు.
పిటిషనర్ తరఫు వాదనలు విన్న ధర్మాసనం.. నోటా వల్ల తలెత్తే పరిణామాలను రాజ్యాంగ సమస్యగా అభివర్నించింది. ‘ఒకవేళ నోటా కారణంగా అందరు అభ్యర్థులు తిరస్కరణకు గురైతే ఆ నియోజకవర్గానికి అసలు ప్రాతినిధ్యమే ఉండదు కదా. అలాంటప్పుడు సరైన పార్లమెంట్‌ను ఎలా ఏర్పాటు చేయగలం? కాబట్టి దీన్ని విస్తృతంగా చర్చించాల్సిన అంశంగా మేం భావిస్తున్నాం’ అని కోర్టు అభిప్రాయపడింది. ఈ అంశంపై అభిప్రాయం చెప్పాలని ఎలక్షన్ కమిషన్, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. కాగా సుప్రీం నోటీసులపై ఈసీ, కేంద్రం ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.https://www.prabhanews.com/videos/a-woman-who-has-been-traveling-8-kilometers-a-day-on-a-single-bicycle-for-35-years/