Saturday, November 23, 2024

ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జలవివాదంపై సుప్రీంకోర్టు ట్విస్ట్

కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ వైఖరిపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. అయితే.. ఇవాళ సుప్రీంకోర్టు సీజేఐ రమణ నేతృత్వంలోని బెంచ్ ముందు ఏపీ సర్కార్‌ వేసిన పిటిషన్‌‌పై విచారణ జరిగింది. మధ్యవర్తిత్వానికి తాము సిద్ధంగా లేమని సుప్రీంకోర్టుకు ఏపీ సర్కారు తెలిపింది. దీంతో ఈ పిటిషన్‌‌పై సుప్రీం కోర్టు సీజేఐ రమణ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఏపీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను మరో బెంచ్‌కు సీజేఐ రమణ బదిలీ చేశారు. న్యాయ ప్రక్రియ ద్వారానే కేసు పరిష్కరించాలని ఏపీ సర్కారు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. అటు సీజేఐ ధర్మాసనమే విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కూడా కోరింది. దీంతో కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తిని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ తోసిపుచ్చారు. దీంతో కృష్ణా నదీ జలాల వివాదంపై ఏపీ సర్కారు పిటిషన్‌‌ను మరో ధర్మాసనానికి బదిలీ చేశారు.

ఈ వార్త కూడా చదవండి: మాజీ మంత్రి దేవినేని ఉమకు బెయిల్ మంజూరు

Advertisement

తాజా వార్తలు

Advertisement