Thursday, November 14, 2024

Supreme Court – అధికారులే న్యాయ‌మూర్తులైతే ఎలా …. బుల్ డోజ‌ర్ల సంస్కృతిపై సుప్రీం కోర్టు అస‌హ‌నం

మీరే అన‌మతులిస్తారు , మీరే కూల్చేస్తారు
ఇదెక్క‌డి న్యాయం ..అధికారులు తీరుపై మండిపాటు
నిందితులైతే ఇళ్లు కూల్చేస్తారా
బ‌ల్ డోజ‌ర్ పంపండం మతం ఏమిటి
న్యాయ విచార‌ణ జ‌ర‌గాల్సిందే
అన్ని విచార‌ణ‌లు పూర్తి అయిన త‌ర్వాత‌
అవ‌స‌ర‌మైతే త‌గిన నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు
ఇక‌పై దేశ వ్యాప్తంగా అధికారులు హద్దు దాటితే
కోర్టు ధిక్కారంతో పాటు జీతంలోంచి బాధితుల‌కు న‌ష్ట ప‌రిహారం ఇస్తాం
బుల్డోజర్ కూల్చివేతలపై సుప్రీం కోర్టు ద‌ర్మాస‌నం కీల‌క తీర్పు

న్యూ ఢిల్లీ – దేశవ్యాప్తంగా జరుగుతున్న బుల్డోజర్ కూల్చివేతలపై సుప్రీం కోర్టు బుధవారం కీలక తీర్పు ఇచ్చింది. యూపీ సహా పలు ప్రాంతాల్లో బుల్డోజర్ల కూల్చివేతల విషయంలో పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అనంత‌రం ధ‌ర్మ‌సనం సంచలన తీర్పును వెల్లడించింది.

పిటిషన్లపై వాదనల సందర్భంగా ధర్మాసనం.. అధికారులు న్యాయ నిర్మేతలు కార‌ని త‌లంటింది. కేవలం ఆరోపణలతో ఏకపక్షంగా పౌరుల ఇళ్లు కూల్చివేయడం రాజ్యాంగ చట్టాన్ని, అధికారాల విభజన సూత్రాన్ని ఉల్లంఘిస్తుందని వివరించింది. కార్యనిర్వాహక వర్గం, అధికారులు చట్టవిరుద్ధంగా ఆస్తులను నిర్ధారించి కూల్చివేయడం సరికాదని సుప్రీం కోర్టు చెప్పింది. నిందితులపై ఎలాంటి చర్యకైనా ముందు న్యాయమైన విచారణ జరగాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అధికారులు ఆస్తులను లీగల్, ఇల్లీగల్ అని నిర్ధారించడం తగదని సుప్రీం కోర్టు బుధవారం తీర్పు చెప్పింది.

నిందితులైతే బుల్డ‌జ‌ర్ లు పంపుతారా

నిందితుల ఇళ్లను బుల్డజర్లతో కూల్చడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో నిందితుల ఇళ్లను కూల్చే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. కూల్చివేతలకు మతంతో సంబంధం ఉండకూడదని తెలిపింది. దేశవ్యాప్తంగా బుల్డోజర్‌ యాక్షన్‌కు మార్గదర్శకాలు జారీ చేసింది.

- Advertisement -

సరైన విధానం పాటించకుండా ఇల్లు కూల్చడం రాజ్యాంగ విరుద్ధమ ని తేల్చి చెప్పింది.కూల్చివేతలకు 15 రోజుల ముందస్తు నోటీసులు తప్పనిసరిగా ఇవ్వాల‌ని ఆదేశించింది.. నోటీసులను మూడు నెలల్లోపు డిజిటల్ పోర్టల్‌లో ఉంచాల‌ని కోరింది. కూల్చివేతలు తప్పనిసరి అయితే దానికి తగిన కారణాలు చెప్పాల‌ని పేర్కొంది. నోటీసులను తప్పనిసరిగా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపాల‌ని ఆదేశించింది.. కూల్చివేతలను తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయాల‌ని అధికారులను కోరింది.. కూల్చివేత చివ‌రి అస్త్రంగా మాత్ర‌మే వాడాల‌ని తేల్చి చెప్పింది.. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామ‌ని హెచ్చ‌రించింది. అధికారుల జీతం నుంచి జరిమానాలు వసూలు చేస్తామ‌ని, ఆ మొత్తాన్ని బాధితుల‌కు న‌ష్ట ప‌రిహారంగా అందిస్తామ‌ని ధ‌ర్మాస‌నం తేల్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement