Saturday, June 29, 2024

Supreme Court – కేజ్రీవాల్ బెయిల్ పిటిష‌న్ విచార‌ణ వాయిదా..

దిల్లీ లిక్కర్ స్కాం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌పై దిల్లీ హైకోర్టు స్టే విధించడాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం పరిశీలించింది. ఈ పిటిషన్‌పై విచారణను జూన్ 26వ తేదీకి(బుధవారం) వాయిదా వేసింది. ఈ సందర్భంగా కోర్టులో ఇరుపక్షాల నడుమ వాడివేడిగా వాదోపవాదనలు జరిగాయి.

కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదిస్తూ, బెయిల్ ఆర్డర్‌పై మధ్యంతర స్టేను తొలగించాలని కోరారు. ఈడీ తరపున హాజరైన ఏఎస్‌జీ ఎస్​వీ రాజు, కేజ్రీవాల్ అభ్యర్థనను వ్యతిరేకించారు. కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే విధించాలని తాము దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు తుది తీర్పు వెలువరించనుందని తెలిపారు. ఇక ఈ అంశంపై హైకోర్టు ఉత్తర్వులు వెలువడే వరకు వేచి చూడాలని న్యాయమూర్తులు జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ పేర్కొంది. తుది ఆదేశాలను హైకోర్టు వెలువరించాల్సి ఉన్న తరుణంలో తాము కలుగజేసుకొని ఉత్తర్వులు ఇవ్వడం అనేది న్యాయసమ్మతం కాదని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement