Monday, November 18, 2024

ఇక్కడెవరూ ఖాళీగా లేరు, రామనవమి ‘అల్లర్ల’ పిటిషన్‌పై సుప్రీం అసహనం..

శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి ఘర్షణలపై విచారణకు జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటును కోరుతూ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మాజీ సీజేఐలు ఎవరూ ఖాళీగా లేరంటూ పిటిషనర్‌పై అసహనం వ్యక్తంచేసింది. ఇటీవల హనుమాన్‌ జయంతి సందర్భంగా ఢిల్లీలోని జహంగీర్‌పురిలో శోభయాత్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులకు పాల్పడిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ ఘర్షణల్లో పోలీసులు సహా పలువురు పౌరులు గాయపడ్డారు. ఈ ఘటన కంటే కొద్ది రోజుల ముందు శ్రీరామ నవమి సందర్భంగా గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌, బెంగాల్‌ రాష్ట్రాల్లో మత ఘర్షణలు చెలరేగాయి.

ఈ ఘటనలపై న్యాయపరమైన దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరుతూ విశాల్‌ తివారీ అనే న్యాయవాది సుప్రీంను ఆశ్రయించారు. ఈ అల్లర్లపై దర్యాప్తునకు మాజీ సీజేఐ నేతృత్వంలో జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన ధర్మాననం పిటిషన్‌దారుపై అసహనం వ్యక్తంచేసింది. ఇక్కడ ఎవరైనా ఖాళీగా ఉన్నారా? ఇలాంటివి అభ్యర్థించకండి. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం అని ధర్మాసనం స్పష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement