ఢిల్లీ: విశాఖ రుషికొండ తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కొండ మొత్తం తొలిచేశారని.. పునరుద్ధరించడం సాధ్యం కాదని ఎంపీ రఘురామ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. తాజా పరిస్థితులతో ధర్మాసనం ముందు ఫొటోలు ఉంచారు. జస్టిస్ గవాయ్, జస్టిస్ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం వీటిని పరిశీలించింది. అనంతరం రిసార్ట్ నిర్మాణానికి మొత్తం కొండ తొలిచేస్తే ఎలా అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అనుమతిస్తే కొండ, పర్యావరణానికి ముప్పు లేకుండా నిర్మాణాలు చేపడతామని హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement