Friday, November 22, 2024

RRR కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

రఘురామ కృష్ణంరాజు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. రఘురామకృష్ణంరాజు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కేవలం బెయిల్ రాకూడదని సెక్షన్ 124 ఏ కింద కేసు నమోదు చేశారని తెలిపారు. రఘురామపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు,  కస్టడీలో రఘురామకృష్ణం తీవ్రంగా కొట్టారు చెప్పారు. కాళ్ళకు తగిలిన గాయాలను ఎంపీ మెజిస్ట్రేట్ కు చూపించారని న్యాయవాదం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రఘురామకృష్ణంరాజు డిసెంబర్ లో బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పారు. రోహత్గి వాదనపై ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లో ఆర్మీ  ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తే అభ్యంతరం లేదని ముకుల్ రోహత్గి చెప్పారు. వాదనల అనంతరం తదుపరి విచారణను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement