Saturday, November 23, 2024

నీట్‌-పీజీ ఎంట్రెన్స పరీక్షకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌..

నీట్‌-పీజీ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యింది. 2021-22 ఏడాదికి నీట్‌-పీజీ కౌన్సిలింగ్‌ నిర్వహించేందుకు శుక్రవారం సుప్రీం కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుత రిజరేషన్ల ప్రకారమే.. కౌన్సిలింగ్‌ నిర్వహించాలని ప్రభుతానికి స్పష్టం చేసింది. ఈ ఏడాది మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఓబీసీలకు 27శాతం, ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్ల రాజ్యాంగ చెల్లుబాటును సుప్రీం కోర్టు సమర్థించింది. తిరిగి కౌన్సిలింగ్‌ ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారమే ముందుకు వెళ్లాలని సూచించింది. మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఓబీసీకి 27శాతం, ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్ల రాజ్యాంగ చెల్లుబాటును సుప్రీం కోర్టు సమర్థించింది.

ఈడబ్ల్యూఎస్‌ లబ్దిదారులను గుర్తించేందుకు రూ.8లక్షల ఆదాయ పరిమితికి కూడా ఓకే చెప్పింది. దీనికి సంబంధించి మార్చి మూడో వారంలో విచారిస్తామని స్పష్టం చేసింది. ఆ సమయంలో ఈడబ్ల్యూఎస్‌ చెల్లుబాటును పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం చేపట్టకుండానే.. ఈడబ్ల్యూఎస్‌ కోటాను వర్తింపజేసేందుకు రూ.8లక్షల వార్షిక ఆదాయ పరిమితిని ప్రమాణంగా విధించిందని నీట్‌-పీజీ అభ్యర్థులు కొందరు సుప్రీంలో సవాల్‌ చేసిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement