2002 గోద్రా అల్లర్లకు సంబంధించి అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీతో సహా అధికారులపై ఆరోపణల కేసులో గుజరాత్ పోలీసులు మానవ హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ను అరెస్టు చేశారు. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, సుప్రీంకోర్టు ఆమెకు ఇవ్వాల (శుక్రవారం) మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్, న్యాయమూర్తులు ఎస్ రవీంద్ర భట్, సుధాన్షు ధులియా నేతృత్వంలోని ధర్మాసనం బెయిల్ విచారణను గుజరాత్ హైకోర్టు విచారిస్తుందని పేర్కొంది.
“కస్టడీ విచారణ పూర్తి కావడానికి అవసరమైన అంశం.. మధ్యంతర బెయిల్ విషయం తాము వినవలసి ఉంటుంది. హైకోర్టులో బెయిల్ విషయం పెండింగ్‌లోనే ఉందని చెప్పాలి. కాబట్టి సెతల్వాద్‌ను బెయిల్‌పై విడుదల చేయాలా వద్దా అనే విషయాన్ని మేము పరిగణించడం లేదు. మేము అటువంటి దరఖాస్తు పెండింగ్‌లో ఉన్న సమయంలో మాత్రమే అప్పీలుదారుని కస్టడీకి పట్టుబట్టాలి. లేదా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలి. అందుకే తీస్తా సెతల్వాద్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నాం’’ అని సుప్రీం కోర్టు తన ఆదేశాల్లో తెలిపింది.