Saturday, November 23, 2024

రిషికొండలో నిర్మాణాలకు సుప్రీంకోర్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌

విశాఖ పట్నంలోని రిషికొండలో టూరిజం భవనాల నిర్మాణాలపై ఎన్జీటీ విధించిన స్టే ఎత్తివేయాలని.. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోటర్లులో విచారణ జరిగింది. రిషికొండలో నిర్మాణాలకు గ్రీస్‌ సిగ్నల్‌ ఇచ్చింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. రిషికొండలో చదును చేసే ప్రాంతాల్లో నిర్మాణాలు చేసుకునేందుకు సుప్రీం కోర్టు అనుమతి మంజూరు చేసింది. నిర్మాణాలు కొనసాగుతున్న ప్రాంతాల్లో సైతం యథావిధిగా పనులు చేసుకోవచ్చని సుప్రీం కోర్టు పేర్కొంది. ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ ఆధారంగా ప్రాజెక్టు పనులను నిలిపివేస్తూ ఎన్జీటీ స్టే ఇవ్వడాన్ని తప్పుబడుతూ ఏపీ ప్రభుత్వం పిల్ వేసింది. ఈ పిటిషన్‌పై మంగళవారం వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టులను చేరుకోలేని వారు రాసే లేఖలను మాత్రమే పిటిషన్లుగా పరిగణించాలంటూ హితవు పలికింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ సింఘ్వి వాదనలు వినిపించారు. ఈ ప్రాజెక్టుతో 300 మందికి ఉపాధి దొరుకుతుందని, రూ.180 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ఓ ఎంపీ రాసిన లేఖ ఆధారంగా ఎన్జీటీ స్టే ఉత్తర్వులు జారీ చేసిందని తెలపగా.. సుప్రీంకోర్టు ఎన్జీటీ తీరు సరికాదని హితవు పలికింది. ఈ కేసులో తదుపరి విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ కేసులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు రిషికొండ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ మంజూరు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement