Saturday, November 23, 2024

ఇద్దరు న్యాయవాదులకు సుప్రీం జరిమానా…

న్యూఢిల్లి : సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయవాదులుచేసిన దుస్సాహసానికి వారిద్దరికీ ఎనిమిది లక్షల రూపాయిల ఎక్సంపలరీ జరిమానాను సుప్రీంకోర్టు విధించింది.దేశ రాజధానిలో ట్రాఫిక్‌,సాంద్రత,వాయు కాలుష్యం. ఎమిషన్‌ల నిబంధనలపై వారు పిటిషన్‌ దాఖలు చేశారు.జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు నేతృతంలోని ధర్మాసనం వీరి పిటిషన్లను తోసివేస్తూకోర్టు అంటే ఆషామాషీగా ఉందా అని ప్రశ్నించారు.జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌,ఇంకా ఇలాంటివే చాలా ఉత్తరులు వచ్చినప్పటికీ మీరు ఈ పిటిషన్లను దాఖలు చేశారంటే ఏమనుకోవాలి అని బెంచ్‌ ప్రశ్నించింది.జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌,జస్టిస్‌ ఎఎస్‌ బోపన్న ఈ ధర్మాసనంలో ఇతర సభ్యులు.పది నుంచి 15 సంవత్సరాల సర్వీసుఉన్న వాహనాలను చట్టవిరుద్ధమైనవిగా, చెల్లవిగా ప్రకటించాలని పిటిషనర్లు కోరారు.ఇలాంటి పిటిషన్లపైవిచారణ జరిపేందుకు జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ వంటివి ఉన్నాయనీ,ఇలాంటి వాటిపై అవి ఇంతకుముందే తీర్పులు ఇచ్చి ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది.

సిబిఐ మాజీ డైరక్టర్‌కి ఫైన్‌

తన ట్విట్టర్‌ అకౌంట్‌లో బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ను పునరుద్ధరించాలని కోరుతూ సీబీఐ మాజీ డైరక్టర్‌ నాగేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లి హైకోర్టు కోర్టు కొట్టివేసింది.ఇలాంటి పిటిషన్‌ను నాగేశ్వరరావు ఇటీవల దాఖలు చేయగా కోర్టు వేసింది.మళ్ళీ ఈ పిటిషన్‌ను దాఖలు చేసినందుకు ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కోర్టు సమయాన్ని వృధా చేయకండి అని మందలించింది.ఆయనకు పదివేల రూపాయిల జరిమానాను విధించింది.ఏప్రిల్‌ ఏడవ తేదీన ఇలాంటి పిటిషన్‌ను దాఖలు చేసినప్పుడు మీరు వెరిఫికేషన్‌ చేయించుకోండంటూ కోర్టు ఆదేశించింది.అయినా మళ్ళీ ఇలాంటి పిటిషన్‌ ఎందుకు దాఖలు చేశారంటూ మందలించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement