ఢిల్లీ: సుప్రీంకోర్టులో టీవీ-9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు ఊరట కలిగింది. రవిప్రకాష్‌కు గతంలో తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న ఈడీ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రవిప్రకాష్ ఏమైనా బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారా అని ఈడీని ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టు అన్ని పరిశీలించిన తర్వాత రవిప్రకాష్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాగా రవిప్రకాష్ అనుమతులు లేకుండా రూ.18 కోట్ల నిధులను విత్‌డ్రా చేసినట్లు హైదరాబాద్ బంజారాహిల్స్ పీఎస్‌లో 2019 అక్టోబరులో కేసు నమోదు కాగా ఈ కేసులో రవిప్రకాష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement