బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
కౌంటర్ కు సమయం కోరిన సిబిఐ
అంగీకరించిన సుప్రీం కోర్టు ధర్మాసనం
ఆంధప్రభ స్మార్ట్ – ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. సుప్రీం కోర్టులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. నేడు జరిగిన విచారణలో కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు మరికొంత సమయం కావాలంటూ సీబీఐ కోర్టును అభ్యర్థించింది. దీంతో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు సీబీఐకి మరో వారం రోజుల పాటు గడువు ఇచ్చింది. అదేవిధంగా తదుపరి విచారణను సెప్టెంబర్ 5కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.
- Advertisement -