Friday, November 22, 2024

Crackers Ban | ఢిల్లీ ప్ర‌భుత్వంపై సుప్రీం ఆగ్రహం !

దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. దీపావళి సందర్భంగా టపాసులు కాల్చడంపై నిషేధం విధించినా అమలు చేయలేదని మండిపడింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు పంపింది.

క్రాక‌ర్స్ పై నిషేధాన్ని అమలు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు, కోర్టు ఆదేశాలు అమలు చేయడానికి తీసుకున్న చర్యల వివరాలను ఢిల్లీ పోలీసులు కోర్టుకు సమర్పించాలి అని స్పష్టం చేసింది. వారం రోజుల్లోగా తమకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. వచ్చే ఏడాది 2025 నిషేధం అమలుకు ప్రతిపాదించిన చర్యలను అఫిడవిట్‌లో పొందుపరచాలని పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement