Friday, November 22, 2024

Rejected – షాహి ఈద్గా స‌ర్వేకు సుప్రీం కోర్టు నో…

న్యూఢిల్లీ: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌థుర‌లో ఉన్న షాహి ఈద్గా లో స‌ర్వే చేప‌ట్టేందుకు సుప్రీంకోర్టు అనుమ‌తి నిరాక‌రించింది. స‌ర్వే కోసం క‌మీష‌న‌ర్‌ను నియ‌మించాల‌ని అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై సుప్రీం స్టే ఇచ్చింది. శ్రీకృష్ణుడి జ‌న్మ‌స్థ‌లంలో మ‌సీదును నిర్మించిన‌ట్లు కొంద‌రు పిటీష‌న‌ర్లు కేసు దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ల‌క్నోకు చెందిన అడ్వ‌కేట్ రంజ‌నా అగ్నిహోత్రి 2020లో ఆ కేసును దాఖలు చేశారు.

13.37 ఎకరాల వివాదాస్ప‌ద స్థ‌లంలో మ‌సీదును నిర్మించిన‌ట్లు ఆరోపించారు. అక్క‌డే క‌ట్రా కేశ‌వ్ దేవ్ ఆల‌యం ఉన్న‌ది. ఈ స్థ‌లంలోనే కృష్ణుడు జ‌న్మించిన చెర‌శాల ఉన్న‌ట్లు పిటీష‌న్‌లో వాదించారు. ఈద్గాలో స‌ర్వే చేప‌ట్టాల‌ని హిందువులు వేసిన పిటీష‌న్‌ను ముస్లింలు వ్య‌తిరేకించారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన సుప్రీం కోర్టు అల‌హాబాద్ హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ, మ‌సీదులో స‌ర్వేకు నిరార‌కరించింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement