Tuesday, November 5, 2024

Suprem Court – యోగి స‌ర్కార్ కు సుప్రీం కోర్టు ఝ‌ల‌క్

మ‌ద‌ర్సా ఎడ్యుకేష‌న్ చ‌ట్టం ర‌ద్దు చెల్ల‌దు
ఆ చ‌ట్టం రాజ్యాంగా బ‌ద్ద‌మేనంటూ తీర్పు
ఆ చ‌ట్టాన్ని ర‌ద్దు చేయ‌డం త‌గ‌దు
అన్ని మ‌ద‌ర్సాల‌ను ఒకే గాట క‌ట్ట‌వ‌ద్దు
మైనార్టీ విద్యా హక్కుల కోసం మ‌ద‌ర్సాలు పాటు ప‌డుతున్నాయి
తొంద‌ర పాటు చ‌ర్య‌ల‌తో మైనార్టీల‌ను విద్యకు దూరం చేయవ‌ద్దు
అల‌హాబాద్ హైకోర్టు తీర్పును త‌ప్పు ప‌ట్టిన సుప్రీ ధ‌ర్మాస‌నం

న్యూ ఢిల్లీ – ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు చట్టం 2004 రాజ్యాంగ‌బ‌ద్ద‌మేనంటూ సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం నేడు తన తీర్పును వెలువరించింది. ఈ చ‌ట్టాన్ని ర‌ద్దు చేస్తూ ముందుగా యుపి స‌ర్కార్ ఒక జీవో విడుద‌ల చేసింది.. దీనిపై యుపిలోని మ‌ద‌ర్సా ల క‌మిటీ అల‌హాబాద్ హైకోర్టును ఆశ్ర‌యించింది.. దీనిపై ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న హైకోర్టు ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. దీనిపై యుపిలోని మ‌ద‌ర్సా ల క‌మిటీ సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది.. అనంత‌రం నేడు తీర్పు ఇస్తూ, అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.

- Advertisement -

యూపీ మదర్సా చట్టంలోని నిబంధనలన్నీ ప్రాథమిక హక్కులను , రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించవని సీజేఐ అన్నారు . మదర్సాలలో నిర్దేశించిన విద్యా ప్రమాణాలను ప్రమాణీకరించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యం అని సుప్రీంకోర్టు పేర్కొంది. మదర్సాల రోజువారీ పనితీరులో మదర్సా చట్టం జోక్యం చేసుకోద‌న్నారు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మైనారిటీల హక్కులను పరిరక్షించడం లక్ష్యంగా పెట్టుకుంద‌ని త‌న తీర్పులో తేల్చి చెప్పింది. . ఇంకా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేలా, వారి మంచి జీవనాన్ని పొందేలా చూడాలనే రాష్ట్ర సానుకూల బాధ్యతకు అనుగుణంగా ఉంద‌ని తేల్చేసింది. మదర్సాలలో విద్యా ప్రమాణాలను క్రమబద్ధీకరించేటప్పుడు, విద్యాసంస్థలను స్థాపించి.. నిర్వహించే మైనారిటీ కమ్యూనిటీ హక్కును రాష్ట్రం ఉల్లంఘించదని సుప్రీంకోర్టు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement