న్యూఢిల్లి: ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. ఎన్నికల సంఘంలో నియామకాలను ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్షనేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీనే చేపట్టాలని ఆదేశించింది. ఈ త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి మాత్రమే నియమించాలని సర్వోన్నత న్యాయ స్థానం స్పష్టంచేసింది.ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 5-0 మెజారిటీతో ఏగక్రీవ తీర్పును వెలువరించింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా ఉండాలని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. పారదర్శకత కొరవడితే వినాశనకర పరిణామాలకు దారితీస్తుందని కూడా అభిప్రా యపడింది. రాజ్యాంగ పరిధిలోనే ఈసీ పనిచేయాలని పేర్కొంది. ఎన్నికల కమిషన్ న్యాయబద్ధంగా వ్యవహరిం చాలని సూచించింది. సీజేఐ, ఎన్నికల కమిషనర్ల నియామ కాల కోసం కొలీజియం వంటి వ్యవస్థను రూపొందించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై ్ట
విచారణ చేపట్టిన జస్టిస్ కేఎం జోసఫ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తీర్పు వెల్లడించింది. ఎన్నికల కమిషనర్ల నియామకాల్లో ప్రస్తుతం ఉన్న వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వీరి నియామకాల కోసం పార్లమెంట్ కొత్త చట్టం తీసుకొచ్చేంత వరకు ఈ త్రిసభ్య కమిటీ అమల్లో ఉంటుందని తెలిపింది. ఒకవేళ ప్రతిపక్ష నేత లేకుంటే, విపక్షంలో మెజారిటీ పార్టీ సభ్యుడు కమిటీలో ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే, ఎన్నికల కమిషనర్ల తొలగింపు ప్రక్రియ, సీఈసీల తొలగింపు వలే ఉంటుందని ధర్మాసనం తెలిపింది.
చట్ట పాలనకు హామీ ఇవ్వని ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. దాని విస్తృత అధికారాలలో, చట్టవిరుద్ధంగా లేదా రాజ్యాంగ విరుద్ధంగా ఉపయోగించినట్లయితే, అది రాజకీయ పార్టీల ఫలితాలపై ప్రభావం చూపుతుంది. ఎన్నికల సంఘం స్వతంత్రంగా ఉండాలి. తాను స్వతంత్రంగా ఉన్నానని చెప్పుకుని, అన్యాయంగా ప్రవర్తించవచ్చు. రాజ్యానికి బాధ్యత వహంచే స్థితిలో ఉన్న వ్యక్తికి స్వతంత్ర ఆలోచన ఉండదు. స్వతంత్ర వ్యక్తి అధికారంలో ఉన్నవారికి తలొగ్గడు” అని జస్టిస్ జోసెఫ్ తీర్పును చదివి వినిపించారు. ఆర్టికల్ 324 ఒక ప్రత్యేకమైన నేపథ్యం కలిగి ఉంది. అనేక దశాబ్దాలు గడిచిపోయాయి. వివిధ రంగుల రాజకీయ పార్టీలు చట్టాన్ని ప్రవేశపెట్టలేదు. ఒక చట్టం ఉన్నదానిని శాశ్వతం చేయదు, నియామకాలలో కార్యనిర్వాహకుడికి పూర్తి హక్కు ఉంటుంది. పిటిషనర్లు ఎత్తిచూపారు.రాజకీయ పార్టీలు చట్టాన్ని కోరకపోవడానికి ఒక కారణం ఉంటుంది, ఇది చూడడానికి స్పష్టంగా ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీకి సేవకుడైన కమిషన్ ద్వారా అధికారంలో కొనసాగడానికి తృప్తి చెందని తపన ఉంటుందఅని ధర్మాసనం పేర్కొంది.
చారిత్రక తీర్పు: విపక్షాలు
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు స్వాగతించాయి. ఈ కీలక తీర్పు దేశంలో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలకు మార్గం సుగమం చేస్తుందని పేర్కొన్నాయి. ‘ఎన్నికల కమిషన్‌పై చారిత్రాత్మక సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ప్రభుత్వ ప్రభావం నుంచి ఈసీని నిరోధించడం ఎన్నికల ప్రక్రియ సమగ్రతను సురక్షితం చేస్తుంది. నిజమైన స్వతంత్ర ఈసీ మాత్రమే స్వేచ్ఛగా ఎన్నికలను నిర్వ#హంచే రాజ్యాంగ ఆదేశాన్ని నెరవేర్చగలదు అని కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ అన్నారు. ఈ తీర్పు ప్రజాస్వామ్య విజయమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. సుప్రీంకోర్టుమైలురాయి ఆదేశం ప్రజాస్వామ్య విజయం. రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. అణచివేత శక్తుల దురదృష్టకర ప్రయత్నాలపై ప్రజల సంకల్పం నెగ్గుతుంది అని ఆమె ట్వీట్ చేశారు. ఇప్పుడు ఎన్నికల సంఘంలో ఎవరు కూర్చోవాలో ప్రధానమంత్రి, విపక్షనేత, సీజేఐ ఉమ్మడిగా నిర్ణయిస్తారు. ఎన్నికల కమిషన్ నిష్పాక్షికతను ప్రశ్నార్థకం చేసే ప్రధానమంత్రి ర్యాలీలు, పథకాల ప్రకటనలను పరిశీలించి ఎన్నికల తేదీలను ఈసీ నిర్ణయించేది. ఈ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది అని ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ అన్నారు. శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది సుప్రీంకోర్టును అభినందించారు ఈ తీర్పును చారిత్రాత్మకమని అభివర్ణించారు.