పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాన్ని ప్రధాని మోడీ అణగదొక్కుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్ కోరుకునే అధ్యక్షపాలన దిశగా బీజేపీ అడుగులు వేస్తోందన్నారు. హిమాచల్‌లోని సోలన్‌లో మోడీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. కమలం గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు. అభ్యర్థులను కాదు కమలం పువ్వును గుర్తుపెట్టుకోండి అని అన్నారు. అభ్యర్థి పేరు గుర్తుపెట్టుకోవాల్సిన పనిలేదని గౌరవనీయ ప్రధాని చెప్పడం ఆయనకు తగదు. పార్లమెంటరీ చర్చలు, మీడియా సమావేశాలకు దూరంగా ఉంటున్న మోడీ, ఇప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రాతిపదికను బలహీనం చేస్తున్నారని చిదంబరం మండిపడ్డారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement