Thursday, November 21, 2024

TS | చలాన్ల రాయితీకి సూపర్ రెస్పాన్స్.. రెండు రోజుల్లో భారీ ఆదాయం

ట్రాఫిక్‌ పెండింగ్‌ చలాన్ల చెల్లింపునకు వాహనదారుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 9.61 లక్షల చలాన్ల చెల్లింపులతో రూ.8.44 కోట్ల ఆదాయం లభించిందని రవాణా శాఖ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌ పరిధిలో 3.54 లక్షల చలాన్ల ద్వారా రూ. 2.62 కోట్లు, సైబరాబాద్‌ పరిధిలో 1.82 లక్షల చలాన్ల చెల్లింపు ద్వారా రూ.1.80 కోట్లు, రాచకొండ పరిధిలో 93 వేల చలాన్లకు రూ.76.79 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు. మరో వైపు చెల్లింపుల తాకిడితో తరచూ సర్వర్‌ హ్యాంగ్‌ అవుతోంది.

పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్ల వసూలు విషయంలో తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుని.. చలాన్ల చెల్లింపులపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ద్విచక్ర వాహనాలకు చల్లాన్లపై 80 శాతం రాయితీ ప్రకటించింది. ఈనెల 26వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు పెండింగ్‌ చలాన్లను డిస్కౌంట్‌తో కట్టే అవకాశం ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement