వాంఖడే స్డేడియంలో జరుగుతున్న మూడో టెస్టులోనూ టాప్ హీరో బ్యాటర్లిద్దరూ అట్టర్ ప్లాప్ అయ్యారు… బౌలర్లు కివీస్ ను తక్కువుకే కట్టడి చేసినా భారత్ ను ఆ ఇద్దరు మరోసారి కష్టాలలో నెట్టేశారు.. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 18, కోహ్లీ 4 పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టారు.. దీంతో ఈ మ్యాచ్ భారమంతా తిరిగి యువ బ్యాటర్ల పైనే పడింది.
ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన కివీస్ ను రవీంద్ర జడేజా (5/65), వాషింగ్టన్ సుందర్(4/81)లు తిప్పేయడంతో 235 పరుగులకే కుప్పకూలింది…. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు నష్టపోయి 86 పరుగులు చేసింది.
ఆఖరి సెషన్‌లో తొందరపాటుకు పోయి కీలక వికెట్లు కోల్పోయింది. అజాజ్ పటేల్ రెండు వికెట్లతో రోహిత్ సేనను దెబ్బకొట్టాడు. శుభ్‌మన్ గిల్(31 నాటౌట్), రిషభ్ పంత్(1)లు క్రీజులో ఉన్నారు. ఇంకా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులు వెనకబడి ఉంది.
తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసి కివీస్‌పై ఒత్తిడి పెంచాలనుకున్న టీమిండియా వ్యూహం ఫలించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ (18) ధాటిగా ఇన్నింగ్స్ మొదలెట్టినా మ్యాట్ హెన్రీకి దొరికిపోయాడు. అయినా శుభ్‌మన్ గిల్(30 నాటౌట్) జతగా యశస్వీ జైస్వాల్(30) దంచాడు. స్వీప్ షాట్లతో అజాజ్ పటేల్‌పై పైచేయి సాధించిన యశస్వీ చివరకు అలాంటి షాట్ ఆడబోయి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
హెన్రీ డైరెక్ట్ త్రో
అంతే.. చూస్తుండగానే రెండు వికెట్లు పడ్డాయి. నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన మహ్మద్ సిరాజ్(0)ను ఆ తర్వాతి బంతికే అజాజ్ ఎల్బీగా ఔట్ చేసి హ్యాట్రిక్ మీద నిలిచాడు. అయితే. విరాట్ కోహ్లీ(4) అతడికి కలను కల్లలు చేశాడు. కానీ, నాటౌట్‌గా మాత్రం నిలువలేకపోయాడు. రచిన్ రవీంద్ర ఓవర్లో అనవసర పరుగుకు ప్రయత్నించిన కోహ్లీని మ్యాట్ హెన్రీ డైరెక్ట్ త్రోతో రనౌట్ చేశాడు.
72-2తో పటిష్టంగా కనిపించిన భారత్ 84 వద్ద 4 వికెట్లు కోల్పోయింది.
మిచెల్, యంగ్‌ల పోరాటంతో..
తొలి రెండు టెస్టుల్లో భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న న్యూజిలాండ్ వాంఖడేలో తేలిపోయింది. స్టార్ ఆటగాళ్లు విఫలం కాగా మూడో సెషన్‌లోనే ఆలౌటయ్యింది. భారత స్పిన్నర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు చేతులెత్తేయగా టీ తర్వాత కాసేపటికే కివీస్ కుప్పకూలింది. రవీంద్ర జడేజా(5/65), వాషింగ్టన్ సుందర్(481)లు తిప్పేయగా 235 పరుగులకే పర్యాటక జట్లు ఇన్నింగ్స్ ముగిసింది. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న డారిల్ మిచెల్(82)ను ఔట్ చేసిన సుందర్.. అజాజ్ పటేల్(7)ను ఎల్బీగా వెనక్కి పంపి న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.