Saturday, June 29, 2024

T20WC | మ‌రికొద్ది సేప‌ట్లో సూప‌ర్ 8.. అమెరికాతో ద‌క్షిణాఫ్రికా ఢీ

20 ప్రపంచకప్ లో మొదటి అంకంలో భాగంగా లీగ్ దశ ముగిసింది. ఇక రెండో అంకంలో అడుగుపెట్టింది. సూపర్ 8 లో భాగంగా తొలిమ్యాచ్ నేడు దక్షిణాఫ్రికా వర్సెస్ అమెరికా మధ్య ఆంటిగ్వాలోని వివియన్ రిచర్డ్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరగనుంది. ట్రాక్ రికార్డ్ పరంగా చూస్తే దక్షిణాఫ్రికా ఫేవరెట్ గా కనిపిస్తున్నా, అమెరికా దూకుడుని చూస్తే.. తేలికగా అంచనా వేయడానికి లేదని అంటున్నారు.

ప్రస్తుతం టీ 20 ప్రపంచకప్ లీగ్ దశలో దక్షిణాఫ్రికా పెర్ ఫార్మెన్స్ అంత ఆశాజనకంగా లేదు. ఏదో చిన్నజట్ల మీద చచ్చీ చెడి గెలిచి సూపర్ 8కి చేరింది. పసికూన నేపాల్ పై ఒక పరుగు తేడాతో అతికష్టమ్మీద గెలిచింది. జట్టలో మొదటి నుంచి చూస్తే క్లాసిన్, మిల్లర్, స్టబ్స్, డికాక్ లాంటి హార్డ్ హిట్టర్ల ఉన్నారు. అయినా సరే, వెస్టిండీస్ లాంటి కఠినమైన పిచ్ లపై ఒక్కసారి 120 పరుగులు దాటలేదు. కాకపోతే నోకియా, బార్ట్ మన్, రబడ, యాన్సెన్ లాంటి సూపర్ ఫామ్ లో ఉన్న బౌలర్ల కారణంగా తక్కువ స్కోరు అయినా, దక్షిణాఫ్రికా బతికి బట్టకట్టింది.

ఇక అమెరికా నుంచి చూస్తే లీగ్ దశలో పాకిస్తాన్ ని మట్టి కరిపించింది. ఇండియాని వణికించింది. కెనడా పై సాధికారికంగా గెలిచింది. అంతేకాదు జట్టులో ఐదుగురికి మించి ప్రవాస భారతీయులు ఉన్నారు. అంటే అమెరికా జట్టు కూడా మినీ ఇండియా జట్టులాగే ఉంది. అంటే అమెరికాతో ఆడుతున్నట్టుగా లేదు.. ఇండియాతో ఆడుతున్నట్టుగానే ఉందని అందరూ అంటున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ 8లో తొలిమ్యాచ్ దక్షిణాఫ్రికాకి సవాల్ గానే మారనుంది.

ఇదే సమయంలో పాకిస్తాన్ ను ఎలా ఓడించి, సూపర్ 8కి చేరిందో, అలాగే సౌతాఫ్రికాను ఓడించి ముందడుగు వేయాలని చూస్తోంది. బ్యాటర్లు ఆరోన్ జోన్స్, గౌస్, గజానంద్ సింగ్, నితీష్ కుమార్, శయన్ జహంగీర్ ఉన్నారు. అలాగే బౌలింగులో నేత్రావల్కర్, కెంజిగే, హర్మీత్ సింగ్ ఉన్నారు. వీరందరూ సమష్టి క్రషితో మ్యాచ్ లను గెలిపిస్తున్నారు. ఫీల్డింగ్ అత్యద్భుతంగా ఉంది. అందువల్ల ఒత్తిడి లేకుండా ఆడటం అమెరికా బలం అని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement