ఒక్క వారంరోజుల వ్యవధిలో భారతజట్టు దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌తోపాటు వన్డే సిరీస్‌నూ కోల్పోయింది. సౌతాఫ్రికా పర్యటనలో మిగిలిన చివరి వన్డేలోనైనా గెలిచి ఊరట పొందాలని టీమిండియా భావిస్తోంది. ఎన్నో ఆశలతో దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన టీమిండియాకు ఈ పర్యటన ఓ పీడకల అనుభవాన్ని మిగిల్చింది. భారతజట్టు ఓటమికి అనేక కారణాలు ఉన్నా ప్రధాన కారణం మాత్రం సరైన సన్నద్ధత లేకపోవడమే. ఏదైనా విదేశీ పర్యటనలో అక్కడి వాతావరణం, ఆయా పిచ్‌లపై ఆటకు అలవాటుపడటానికి జట్టు ముందుగానే అక్కడికి వెళ్లి రెండు మ్యాచ్‌లు ఆడటం చాలా కీలకం. సేన (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో విజయం సాధించాలంటే ఆవిధంగా ప్రిక్టీస్ చేయడం ముఖ్యం. గత సంవత్సరం ఆస్ట్రేలియాలో భారతదేశం అద్భుతమైన సిరీస్ విజయం సాధించినపుడు వారు ముందుగానే అక్కడకు వెళ్లారు. ఆసీస్‌తో వారి సొంతగడ్డపై ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడారు. టెస్టు మ్యాచ్‌ల్లో ఆసీస్‌తో తలపడే ముందు భారతజట్టు వారితో వైట్‌బాల్ సిరీస్‌ను కూడా ఆడింది. తద్వారా ఆటగాళ్లు ఏ సమయంలోనైనా ఆడేందుకు మెరుగ్గా సిద్ధమయ్యారు. తద్వారా పింక్‌బాల్ టెస్టులో ఓటమి తర్వాత తిరిగి పుంజుకుని విజయపథంలో పయనించారు. భారత క్రికెట్ చరిత్రలో గొప్ప సిరీస్ విజయాల్లో ఒకటిగా నిలిపారు.
కొవిడ్ మహమ్మారి కారణంగా ఈసారి వీలైనంత తక్కువగా ప్రాక్టీస్ మ్యాచ్‌లను ఆడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ప్రారంభమయ్యేముందు ఎటువంటి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఏర్పాటు చేయలేదు. బహుశా ప్రొటీస్‌ను తక్కువగా అంచనా వేయడం కారణం కావచ్చు. కానీ అంతిమ ఫలితం ఏమిటంటే దక్షిణాఫ్రికాను సొంతగడ్డపై ఓడించి టెస్టు సిరీస్ గెలవానే భారతజట్టు కల సాకారం కాలేదు. ఇక ఒక వన్డే మాత్రమే మిగిలి ఉంది. చివరివన్డేలోనైనా భారతజట్టు తమ మిలియన్ల అభిమానుల కోసమైనా తప్పక గెలవాలి. ఈక్రమంలో జట్టును సరిదిద్దాల్సిన అవసరం ఉంటే చేయాలి. జట్టులో కొత్తశక్తిని నింపాలి. ఓడిపోయిన జట్లలో భాగంకాని ఓడిపోయే మనస్తతంలేని ఆటగాళ్లకు అవకాశమివాలి. తద్వారా ఫలితం భారత్‌కు అనుకూలంగా మార్చుకోవాలి. జట్టును ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..